విశాఖపట్నం కలెక్టరేట్లో సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి దొమ్మేటి కృషి చేశారని, ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.