KKD: ప్రత్తిపాడు మండలంలో ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా పెదశంకర్లపూడి గ్రామ పంచాయతీకి కొత్త ట్రాక్టర్ మంజూరైంది. ఇవాళ సాయంత్రం ఈ ట్రాక్టర్ను స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జెండా ఊపి ప్రారంభించారు. ఈ గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త వాహనం సమకూరడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.