AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ కట్టుపాలెం గ్రామంలో సాయిబాబా విగ్రహ ప్రతిష్టను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, హోమం తదితర కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపించారు. భక్తులు పలువురు ఆలయానికి విచ్చేసి సాయిబాబాను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు ప్రసాదాలను అందజేశారు.