ప్రకాశం: ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకాశం జిల్లాలో మంగళవారం పర్యటించారు. మంత్రికి ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య శాలువ, పూలమాలతో సన్మానించి స్వాగతం పలికారు. మంత్రి టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని దామచర్ల సత్య కార్యాలయాన్ని సందర్శించి స్థానిక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.