KRNL: డోన్ నుంచి కర్నూలుకు వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని శనివారం అధికారులు తనిఖీ చేశారు. తనిఖీలో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న 15 కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను గుర్తించారు. వెంటనే సిలిండర్లను స్వాధీనం చేసుకుని వాహనాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.