అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో ప్రతి సోమవారం నిర్వహించే పల్లకి సేవ ఈసారి ఘనంగా జరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.