W.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భీమవరంలో ఆదివారం 2కె రన్ నిర్వహించారు. స్థానిక ప్రకాశం చౌక్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సాగిన ఈ పరుగును కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శారీరక దృఢత్వమే ఆరోగ్యానికి పునాదని, మహిళలందరూ ప్రతిరోజూ వ్యాయామానికి సమయం కేటాయించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.