KRNL: పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం గ్రామ శివారుల్లో ఉన్న రాయల చెరువు మెయింటెనెన్స్ పనులకు ఆర్ఆర్ఆర్ కింద రూ. 1.20 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఇరిగేషన్ శాఖ జేఈ సంజీవ్ కుమార్ తెలిపారు. రాయల చెరువు గట్టుపై పేరుకుపోయిన చెట్లను తొలిగించుట, గట్టును బలోపేతం చేయుట, కాలువలకు మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు.