CTR: యాదమరిలో ఈనెల 23న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చిత్తూరు DSP వెంకటనారాయణ తెలిపారు. చిత్తూరు- పరదరామి-గుడియాత్తం మార్గంలో వెళ్లే వాహనాలను కాట్పాడి-వేలూరు వైపు మళ్లించనున్నట్లు చెప్పారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించి పోలీసులకు సహకరించాలన్నారు.