ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని బాలాజీ నగర్లో ఆదివారం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్థానిక ప్రజలకు మత్తు పదార్థాలపై పోలీసులు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు DSP తెలిపారు.