PPM: జియ్యమ్మ వలస మండలంలోని కుందర తిరువాడ పంచాయతీలో నిర్వహించిన ‘రైతన్న-మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9,233 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.3.69 కోట్లు, 8,356 మంది రైతులకు పీఎం కిసాన్ కింద రూ.1.67 కోట్లు అందించినట్లు తెలిపారు. మొత్తం రూ.5.36 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు.