ప్రకాశం: అర్ధవీడులోని పరీక్షా కేంద్రాలను ఎస్సై నాంచారయ్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, పరీక్ష కేంద్రాల సమీపంలో నెట్ సెంటర్లు, జిరాక్స్ కేంద్రాలను స్వచ్ఛందంగా మూసివేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.