BPT: బాపట్లను మత్తు రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ చేపట్టారు. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో వేదుళ్లపల్లి పోలీసులు, ఈగల్ సెల్ సిబ్బంది విద్యాసంస్థల వద్ద తనిఖీలు చేశారు. నిషేధిత ‘కూల్ లిప్’ తదితర పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. పాఠశాలలకు 100 మీటర్ల లోపు వీటిని అమ్మరాదన్నారు.