ప్రకాశం: సింగరాయక జాతీయ రహదారిపై గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో షేక్ అలీ ఖాన్, షేక్ నాగూర్ బి అనే వృద్ధ దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై స్వగ్రామమైన మంగమూరుకు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇదే ప్రమాదంలో నాగూర్ వలి అనే యువకుడు గాయపడ్డాడు.