TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం (SSD టోకెన్లు లేకుండా)కు సుమారు 6 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం నాటికి 65,534 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,560 మంది తలనీలాలు సమర్పించుకోగా, హుండీ ఆదాయం రూ. 3.22 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.