అన్నమయ్య: పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ ఎన్ఆర్ బైలులో తండ్రిపై కుమారుడు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. లక్ష్మన్న (56) మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడుతుండగా కుమారుడు గంగాధర్ అడ్డుకున్నాడు. అయినా తండ్రి ఆగకపోవడంతో గంగాధర్ కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన లక్ష్మన్నను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.