కోనసీమ: ఆలమూరు మండలం చెముడు లంక గ్రామదేవత శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గరగ నృత్యాలు, వివిధ వేష ధారణలు, భక్తులను ఆకట్టుకున్నాయి. బాణాసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.