VSP: పాయకరావుపేట మండలం అరట్లకోటలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మలకా నూకయ్య పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విలువైన వస్తువులు, గృహోపకరణాలు మంటల్లో కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న టీడీపీ, జనసేన స్థానిక నాయకులు బాధితులను పరామర్శించారు.