KDP: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై CPI ML లిబరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బద్వేలులో జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల ఓబయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు సుమారు రూ.3000 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్లే సేవలు నిలిచిపోయాయని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఉచిత వైద్యం పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.