కోనసీమ: ఆత్రేయపురం మండలం లొల్లలాకులు కాలువల మరమ్మతు, ఆధునీకరణ, రావులపాలెం-బొబ్బర్లంక రాష్ట్ర రహదారి విస్తరణ పనులకు ప్రభుత్వం రూ. 74.2 కోట్లు కేటాయించిందని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 2వ తేదీన పరిపాలన అనుమతి లభించగా.. డిజైన్ ప్రతిపాదనలు చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్ విభాగానికి సమర్పించారు. త్వరలో టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు.