PPM: హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యులు కడ్రక మల్లేశ్వరరావు, కాకి లక్ష్మి కలిశారు. ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు పర్యటనలో గిరిజన ఖైదీల సమస్యలు తెలుసుకుని, సోమవారం మంత్రికి వివరించారు. గంజాయి కేసుల్లో అక్రమంగా కేసులు నమోదు, పాత కేసులను పునరావృతం చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.