NTR: ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. డీఈవో ఎల్. చంద్రకళతో కలిసి కలెక్టరేట్లో ఏవీఎస్ రెడ్డి హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను నో మొబైల్, అలాగే 144 సెక్షన్ అమలుచేయనున్నట్లు పేర్కొన్నారు.