చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. బాధితుల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకుంటున్నారు. వారి వినతి పత్రాలు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఆదర్శ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, డీఆర్వో మోహన్ పాల్గొన్నారు.