ATP: శింగనమల MLA బండారు శ్రావణి జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను కలిశారు. నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. బుక్కరాయసముద్రం ఇళ్ల పట్టాలు, జంబులదిన్నె ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం, పుట్లూరు బ్రిడ్జి పనుల వేగవంతంపై చర్చించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీర్చాలని కోరారు. స్పందించిన కలెక్టర్, సంబంధిత శాఖాధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
Tags :