TPT: తిరుపతి జిల్లా తడలో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారుల సంయుక్త తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తడ కండ్రిగలోని ఎస్ఎస్ఆర్ వైన్స్, KR జీవా ఫ్రైడ్ రైస్ షాప్లో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో 6(ఏ) కేసు నమోదు చేసి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.