W.G: సమాజాన్ని మార్చగలిగే శక్తి కేవలం విద్యకే ఉందని ఆనాడే జ్యోతిరావు పూలే కృషి చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మహిళలు విద్యావంతులు అయితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని పూలే భార్య కృషి చేసారన్నారు. పాలకొల్లు అడబాల థియేటర్ వెనుక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.