SKLM: ఆమదాలవలసలో ఆల్ ఇండియా RMS&ఎంఎంఎస్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్-సి ఆధ్వర్యంలో 41వ ద్వైవార్షిక డివిజనల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోస్టల్ ఉద్యోగులు దేశ కమ్యూనికేషన్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.