నెల్లూరు రూరల్లోని 12వ క్లస్టర్లో నిర్వహించిన మహానాడుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి వైష్ణవి విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ… ఈ ‘మహానాడు’ను విజయవంతం చేసిన ప్రతి నాయకులకు, కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.