GNTR: కాకుమానులోని ఇండియన్ స్కూల్ వద్ద ఉన్న బస్టాండ్లో శనివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 55 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలిసిన వారు వెంటనే కాకుమాను పోలీసులను సంప్రదించాలన్నారు.