VZM: బొబ్బిలిలో ఆహార భద్రత నియంత్రణాధికారి ఎస్. ఈశ్వరి ఆధ్వర్యంలో టోకు, చిల్లర వ్యాపారులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా FSSAI చట్టం, ఆహార కల్తీ ప్రమాదాలు, అయోడిన్ లోపంతో వచ్చే వ్యాధులపై వివరించారు. బెల్లంలో కృత్రిమ రంగుల వల్ల నష్టాలపై అధికారి పి. వెంకట రమణ అవగాహన కల్పించారు.