KDP: ముద్దనూరులో రౌడీ షీటర్లకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సి.ఐ నగేష్ ఆధ్వర్యంలో వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.