GNTR: మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్ష కోసం జిల్లాలో 20 కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతి ప్రాంతాల్లో ఈ కేంద్రాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్, పరీక్ష నిర్వహణపై సమీక్షించారు.