Akp: గొలుగొండ మండలంలోని చీడిగుమ్మల హైస్కూల్లో గురువారం జనగణన-2027కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు తహసీల్దార్ కే.నూకరాజు , ఏఎస్ఓ మీనా, మాస్టర్ ట్రైనర్లు ఎస్.నరసింహం, రమణమూర్తి మార్గదర్శకత్వంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో గణన విధానాలు, డేటా సేకరణపై వివరించారు.