BPT: కూటమి పాలనకు రెండేళ్లు నిండిన వేళ బాపట్లలో డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఈ వివరాలు తెలిపారు. ఇంధన ఆదాలో భాగంగానే ఈ వినూత్న పద్ధతి ఎంచుకున్నామన్నారు. నియోజకవర్గంలో పది చోట్ల ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, రూరల్ ప్రాంతాల్లో ఈ ప్రసారాలు చూడొచ్చన్నారు.