E.G: నిడదవోలు రైల్వే స్టేషన్ ఆధునిక సదుపాయాలతో, సరికొత్త హంగులతో రూపుదిద్దుకోనుంది. కేంద్ర ప్రభుత్వ చొరవతో రైల్వే జంక్షన్ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 27.46 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు, లిఫ్టులు, ఎస్కలేటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.