KRNL: జిల్లాలో చెరువుల్లోకి నీటి ప్రవాహాన్ని పెంచే లక్ష్యంతో కాలువలు శుభ్రపరిచే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ‘జలధార జలహారతి’ కార్యక్రమంలో భాగంగా కర్నూలు మండలం తొలిసాపురం గ్రామ చెరువు పనులను, ఉపాధి హామీ శ్రామికులతో చేయిస్తున్న పూడికతీత పనులను ఆమె స్వయంగా పరిశీలించారు.