KRNL: ఆస్పరి మండలం పుటకలమర్రి వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన ఘటనపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇవాళ స్పందించారు. విజయవాడలో ఉన్న ఆయన ఫోన్లో అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. దాదాపు 20 మంది గాయపడటం బాధాకరమని, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.