ప్రకాశం: కనిగిరి పట్టణంలో ఇంఛార్జి డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలోని మంగళమాండ్యంలో కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్‌లో పామూరు సీఐ వినోద్ కుమార్, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలించి లైసెన్సు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నిర్మూలమే ప్రధానంగా తనిఖీ నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు.