KDP: లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలసిన వెయ్యి నూతులకోనలో శనివారం సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి తెల్లవారుజామున జల, పసుపు, కుంకుమ, చందన, తేనెతో పంచామృత అభిషేకాలు చేపట్టి అనంతరం పూల మాలలు, తులసి దళాలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.