పల్నాడు: జిల్లాలో లాయర్ హరిప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ ఆఫీసులో పనిచేసే కానిస్టేబుళ్లు వెంకట కోటయ్య, శ్రీనివాసరావులను అరెస్ట్ చేశారు. మృతుడి భార్యతో కోటయ్యకున్న వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమని డీఎస్పీ తెలిపారు. శుక్రవారం యడవల్లి వద్ద ఇనుప రాడ్, బండరాయితో దాడి చేసి హరిప్రసాద్‌ను వీరు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.