AKP: నర్సీపట్నంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. టౌన్ సీఐ షేక్ గఫూర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాహన తనిఖీల్లో నక్కపల్లికి చెందిన అనుమాను శ్రీను పట్టుబడగా, విచారణలో ఒక మైనర్ పాత్ర కూడా బయటపడింది. వీరి వద్ద నుంచి 8 దొంగిలించిన బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.