ELR: చింతలపూడిలో గుడ్ ఫ్రైడే ర్యాలీ సందర్భంగా ముస్లిం సోదరులు మత సామరస్యాన్ని చాటారు. జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ర్యాలీలో పాల్గొన్న భక్తులకు లస్సీ, మజ్జిగ పంపిణీ చేశారు. ఏసుక్రీస్తు శాంతి కోసమే ప్రాణత్యాగం చేశారని మత గురువు కామ మాథ్యూ పేర్కొన్నారు. ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఐక్యతను చాటుతున్నామని ముస్లిం సోదరులు తెలిపారు.