ATP: గ్రామాభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన సర్పంచులను గౌరవించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. గ్రామాల పురోగతికి వీరి సేవలు బలమైన పునాది వేశాయని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారంలో వారు చూపిన నిబద్ధత అభినందనీయమన్నారు. గ్రామాల అభివృద్ధిలో వీరి పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.