TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల సర్పంచుల పదవీకాలం ముగిసిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులను శాలువాలు కప్పి సన్మానించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.