VSP: టీబీ ముక్తి భారత్ అభియాన్ 2.0లో భాగంగా శివాజీపాలెం క్యాంప్ కార్యాలయంలో గోడపత్రికలను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీబీ నిర్మూలనకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, కఫంలో రక్తం కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలన్నారు.