VSP: సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేసి పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం సేవ నిర్వహించారు. అనంతరం మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలను భక్తులకు అందజేశారు.