ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసిద్ధ స్వయం జంబుకేశ్వరుడు ప్రత్యేక పుష్పాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు.పురోహితులు రామకృష్ణ ఉదయాన్నే స్వామి మూల విరాట్‌కు పంచామృత, ఏకవార రుద్రాభిషేకాలు చేపట్టి స్వామి మూలవిరాట్‌పై ప్రత్యేక పుష్పాలతో అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.