TG: పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ డిస్మిస్ చేయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ‘కన్నతల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో, రక్షించాల్సిన శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పెద్ద పాపం’ అని వ్యాఖ్యానించారు.