AP: మహిళల జోలికి వస్తే తాట తీస్తానని పవన్ డైలాగులు చెబుతున్నారంటూ జగన్ ఎద్దేవా చేశారు. ‘మహిళలపై దారుణాలకు పాల్పడ్డ మీ నేతల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? అరవ శ్రీధర్ విషయంలో ఏం చేశారు? ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు అంటున్నారు. మీ పాలనలో పాలు, నీళ్లు తాగినా చనిపోతున్నారు. చంద్రన్న కానుకకే దిక్కులేదు, కానీ మూడో బిడ్డకు డబ్బులు ఇస్తానంటున్నారు’ అంటూ విమర్శించారు.