AKP: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సీపట్నం రిషి డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళకు 242 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. ఇంటర్వ్యూల అనంతరం 108 మంది అభ్యర్థులు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్లేస్మెంట్ అధికారి పప్పల శ్రీనివాసరావు పాల్గొన్నారు.